అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
తప్పిన పెను ప్రమాదం..
ములుగు, మే 7, తెలంగాణ జ్యోతి: తాడ్వాయి మండలం కొండపర్తి స్టేజి సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి అడవిలోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఎటూరునాగారం నుంచి ములుగు వైపు వస్తున్న బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుకు పక్కనే ఉన్న అడవిలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో పలువురికి స్వల్పగాయాలైనట్లు సమాచారం . స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణి కులను బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









