గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

On: May 6, 2026 5:23 PM

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

ఏటూరునాగారం, మే 6, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలంలోని కొండాయి, చిన్నబోయినపల్లి గ్రామాల్లో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజల నుంచి నేరుగా అడిగి తెలుసుకుని, సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రామాభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ఏడాది వరదలతో తీవ్రంగా నష్టపోయిన కొండాయి గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా కొండాయి గ్రామానికి 115 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, అర్హులైన ప్రతి కుటుంబానికి రెండో విడతలో ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. కొండాయి వాగుపై సుమారు రూ.16 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ప్రారంభించామని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గ్రామ ప్రజలకు అండగా నిలిచామని, ఇప్పుడు అధికారంలో ఉండి మరింత నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం చిన్నబోయినపల్లి ప్రజాదర్బార్‌లో ఇటీవల వెలువడిన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన కే. కృష్ణ అనే విద్యార్థిని సన్మానించారు. అలాగే ఎంపీడీవో కార్యాలయాలకు నూతనంగా వచ్చిన కంప్యూటర్లు, ప్రింటర్‌, స్కానర్‌లను అందజేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!