దుప్పిని వేటాడిన ముగ్గురిపై కేసు నమోదు
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు
ఏటూరునాగారం, మే 5, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం దక్షిణ అటవీ క్షేత్ర పరిధిలోని చిన్నబోయినపల్లి సెక్షన్, చిన్నబోయినపల్లి బీట్ ప్రాంతంలో చుక్కల దుప్పిని వేటాడిన ముగ్గురు నిందితులపై అటవీ అధికారులు కేసు నమోదు చేసి మంగళవారం ములుగు జిల్లా కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. శాపల్లి గ్రామానికి చెందిన ఉన్నిని లచ్చిమ్ (కిష్టయ్య కుమారుడు), యాలం చందు (సాంబయ్య కుమారుడు), ఆకులవారి ఘనపురం గ్రామానికి చెందిన కుడుదుల నర్సింఘరావు (మల్లయ్య కుమారుడు)పై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో చుక్కల దుప్పిని వేటాడినట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో ఏటూరునాగారం దక్షిణ అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహ్మాన్ ఆధ్వర్యంలో డైరో చి. నారాయణ, ఎఫ్‌బీవో కెఎం చిష్టీ, దయానంద్, బేస్‌క్యాంప్ సిబ్బంది సాంబ, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.









