రావి ఆకుపై తమిళనాడు సీఎం విజయ్ చిత్రపటం
ఆకట్టుకున్న ఆర్ట్ టీచర్ రమేష్
ఏటూరునాగారం, మే 5, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ట్ టీచర్ రమేష్ తన సృజనాత్మకతతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రముఖ నటుడు మరియు తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చిత్రపటాన్ని రావి ఆకుపై లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రూపొందించారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ప్రత్యేక కళాఖండం స్థానిక ప్రజలను విశేషంగా ఆకర్షించగా, రమేష్ కళా నైపుణ్యానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత నైపుణ్యంతో, సూక్ష్మంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కళాకారుడి ప్రతిభను మరింతగా ప్రతిబింబిస్తోంది.









