ఎదిర పీహెచ్‌సీలో టిబి ముక్తి భారత్ కార్యక్రమం

On: May 4, 2026 4:37 PM

ఎదిర పీహెచ్‌సీలో టిబి ముక్తి భారత్ కార్యక్రమం

ఎదిర పీహెచ్‌సీలో టిబి ముక్తి భారత్ కార్యక్రమం

వెంకటాపురం నూగూరు, మే 4, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలనలో భాగంగా సోమవారం టిబి ముక్తి భారత్ కార్యక్రమాన్ని వైద్య అధికారి డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల టిబి ముక్తి భారత్ అభియాన్ కింద పరీక్షలు నిర్వహించి, గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి బోధపురం సర్పంచ్ కోర్స నరసింహారావు హాజరై వైద్య సిబ్బందికి సహకారం అందించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి కుప్పిలి కోటిరెడ్డి, ఏస్టీఎస్ వెంకటేశ్వరావు, హెల్త్ అసిస్టెంట్లు రాజేష్, రాంబాబు, మోహన్ కృష్ణ, ఏఎన్ఎంలు ధనలక్ష్మి, వెంకటరమణ, ఎక్స్‌రే టెక్నీషియన్ లక్కాన్, నర్సింగ్ ఆఫీసర్ స్వప్నతో పాటు ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!