నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క
భద్రాచలం ఎమ్మెల్యే
వెంకటాపురం నూగూరు, మే 3, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జరిగిన వివాహ మహోత్సవానికి ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పీర్ల కృష్ణ బాబు కుటుంబానికి చెందిన ఈ వివాహం ఆయన స్వగృహంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని చొక్కాల గ్రామంలో జరిగిన మరో వివాహానికి కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటాలు, వాయిద్యాల మధ్య పుష్పాలతో మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.









