హనుమాన్ నగర సంకీర్తనకు సీతక్కకు ఆహ్వానం
ములుగు, మే 1, తెలంగాణ జ్యోతి: మే 5న ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్కను హనుమాన్ భక్తమండలి సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామాలయంలో నిర్వహించనున్న నగర సంకీర్తన కరపత్రాన్ని ఆవిష్కరించారు. భక్తి భావంతో సంకీర్తనను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. రామాలయం దేవస్థానం నుండి ములుగు పట్టణ మెయిన్ రోడ్ మీదుగా పుర వీధుల గుండా శ్రీ అంజనేయస్వామి వారి శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. శోభాయాత్రలో భజన బృందాల ద్వారా రామనామ సంకీర్తనతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. అనంతరం రామాలయం ప్రాంగణంలో మధ్యాహ్నం 12:30 గంటలకు హనుమాన్ స్వాములకు మరియు భక్తులకు మహా అన్నప్రసాద వితరణ (అన్నదానం) నిర్వహించ నున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తమండలి సభ్యులు ఆవుల ప్రశాంత్ రెడ్డి, బాణాల రాజ్ కుమార్, ఒజ్జల కుమారస్వామి, బైకాని నటరాజ్, కొనుపుల కుమార్, రేవంత్ యాదవ్, చిందం చందు, కాబట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.









