గొత్తికోయగూడెంలో మెడికల్ క్యాంప్ : గర్భిణీలకు ప్రత్యేక సేవలు

On: May 1, 2026 1:58 PM

గొత్తికోయగూడెంలో మెడికల్ క్యాంప్ : గర్భిణీలకు ప్రత్యేక సేవలు

గొత్తికోయగూడెంలో మెడికల్ క్యాంప్ : గర్భిణీలకు ప్రత్యేక సేవలు

ఏటూరునాగారం, మే1, తెలంగాణ జ్యోతి: ఏటూరు నాగారం మండలం లోని కొండాయి గ్రామపంచాయతీ పరిధి మల్యాల గ్రామంలో శుక్రవారం కొండాయి వైద్యాధికారి డాక్టర్ హెచ్ ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య అవగాహన సదస్సు మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మందికి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ ప్రణీత్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటిని నిల్వగా ఉంచకుండా పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు. గొత్తికోయగూడెంలో గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు మరియు ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కె. భాస్కర్ రావు, ఆశా వర్కర్ జ్యోతి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!