టియూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్ బలోపేతానికి కృషి చేయాలి
మే 15న ములుగులో ఐజేయూ మహాసభను విజయవంతం చేయాలని పిలుపు
ములుగు, ఏప్రిల్ 30, తెలంగాణ జ్యోతి: టియూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్ బలోపేతానికి సభ్యులు కృషి చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెళ్లి మధు పిలుపునిచ్చారు. గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బస్సాపూర్ సమీపంలోని “విరించి” రిసార్ట్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండి షఫీ అహ్మద్, కార్యదర్శి చిదురాల వాసుదేవ్ల అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి మండలంలో ఐజేయూ సభ్యుల సంఖ్య పెరిగేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు విషయంలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలవాలని పిలుపునిచ్చారు. సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా యూనియన్ రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మే 15న ములుగు జిల్లా కేంద్రంలో ఐజేయూ మహాసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక నాయకత్వానికి సూచిస్తూ, జిల్లాలోని అన్ని మండలాల నుంచి సభ్యులు అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభకు రాష్ట్ర నాయకత్వంతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం పలు అంశాలపై స్థానిక నాయకులతో చర్చించారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎలగందుల కొమురయ్య, జిల్లా ఉపాధ్యక్షులు భేతి సతీష్ యాదవ్, గంపల శివ, సంయుక్త కార్యదర్శి చుంచు రమేష్, హరికృష్ణ, కోశాధికారి బైకానీ నటరాజ్, దాడుల వ్యతిరేక కన్వీనర్ జాలిగం శ్రీనివాస్, చిన్న పత్రికల ప్రధాన కార్యదర్శి ఎనుగందుల శంకర్, జింకల ప్రభాకర్, గోల్కొండ రాజు, ముండ్రాతి ప్రతాప్, కుదురుపాక ప్రవీణ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.









