ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన లెనిన్ వత్సల్ టోప్పో
ఏటూరునాగారం, ఏప్రిల్ 26, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా లెనిన్ వత్సల్ టోప్పో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన చిత్రమిశ్రా రెండు నెలల క్రితం జరిగిన బదిలీల్లో కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టగా, అప్పటి నుంచి ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో మహబూబాబాద్ అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న లెనిన్ వత్సల్ టోప్పోను ప్రభుత్వం ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా నియమించగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు.









