గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్..
– చాకచక్యంగా పట్టుకున్న వాజేడు పోలీసులు
ములుగు/ వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా వాజేడు పోలీసులు శాఖ పట్టుకున్నారు. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కోసం తరలిస్తున్న నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల అరెస్టు చూపారు. అందుకు సంబంధించిన వివరాలను వెంకటాపురం సీఐ బండారి కుమార్ విలేకరుల సమా వేశంలో వెల్లడించారు. నిషేధిత గంజాయి తరలిస్తున్నారనే పక్క సమాచారం మేరకు వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి మండలంలోని జగన్నాధపురం వై జంక్షన్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. వెంకటాపురం వైపునుండి జగన్నాదపురం వైపు ఒక కారు, నాలుగు బైక్ లు వస్తుండగా ఎస్ఐ వెంకటేశ్వరరావు వాహనాలు నిలిపివేసి తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో TS 19 E 9657 నంబర్ గల కారు, మరో రెండు బైక్ ల ద్వారా 4కేజీ ల గంజాయి పట్టుబడింది. మరో రెండు బైకుల మీద ఐదు గురు వ్యక్తులు పరారయ్యారు. కారు నాలుగు బైకులపై 14 మంది యువకులు గంజాయి తరలిస్తున్నట్లు నిర్ధారణ చేసుకున్న పోలీసు లు 9 మందిని అరెస్టు చేశారు. పరారీ లో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు సీఐ కుమార్ తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో తాడ్వాయి మండలం మేడారంకు చెందిన సిద్ధార్థ, మధుకర్, అఖిల్, కొత్తూరు కు చెందిన కే.మధుకర్, సాయి, సుధీర్, వాజేడు మండలం కొప్పునూర్ కు చెందిన సాకేత్, మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సిఐ తెలిపారు. దీతుల నుంచి కారు రెండు బైకు లు మొబైల్ ఫోన్లు నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.యువత చెడువ్యసనాలకు బానిసలైబంగారు భవిష్య త్తు పాడుచేసుకోవద్దని, గంజాయి వంటి మత్తు పదార్థాలు సరపరా చేసిన, వినియోగించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామనీ సీఐ బండారి కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
1 thought on “గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్.. ”