బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్‌గా సంతోష్ రెడ్డి
ఏటూరునాగారం, ఏప్రిల్ 26, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన కందడి సంతోష్ రెడ్డిని బీజేపీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీలో ఐటీ సెల్ కన్వీనర్‌గా నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనర్సయ్యకు సంతోష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతు సమస్యలపై సోషల్ మీడియా వేదికగా గళం వినిపించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.









