ములుగు కలెక్టర్ గా బోర్కడే హేమంత్ సహదేవరావు
ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా లెనిన్ వత్సల్ టోప్పో
ములుగు, ఏప్రిల్ 25, తెలంగాణ జ్యోతి: జిల్లాలో పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ములుగు కలెక్టర్గా బోర్కడే హేమంత్ సహదేవరావును ప్రభుత్వం నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తూ, ఇంతకుముందు నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సేవలందించారు. ఇదే సమయంలో ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న దివాకర్ టీఎస్‌ను ఖమ్మంకు బదిలీ చేశారు. మరోవైపు ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా లెనిన్ వత్సల్ టోప్పోను ప్రభుత్వం నియమించింది. ఇంతకు ముందు పనిచేసిన చిత్రమిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడంతో, అప్పటి నుంచి ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా బదిలీల్లో మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న టోప్పోకు ఈ బాధ్యతలు అప్పగించగా, త్వరలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.









