గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన డిగ్రీ విద్య

On: April 25, 2026 2:57 PM

గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన డిగ్రీ విద్య

గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన డిగ్రీ విద్య

ఏటూరునాగారం కళాశాలలో ఉచిత దోస్తీ రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఏటూరునాగారం, ఏప్రిల్ 25, తెలంగాణ జ్యోతి: గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన డిగ్రీ విద్య అందిస్తున్న ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులకు దోస్తీ ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి. రేణుక తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాన కూడళ్లలో గోడ పత్రికలు, పోస్టర్లతో అధ్యాపక బృందం విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రేణుకతో పాటు అధ్యాపకులు జీవవేణి, జ్యోతి, ఫాతిమా మాట్లాడుతూ కళాశాలలో BA, B.Sc (BZC, MPC), B.Com (CA, AEDP), BA (HEP, CA) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల అభ్యాసానికి అనుకూలంగా జూలాజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీ, వర్చువల్ క్లాస్‌రూమ్స్, స్మార్ట్ బోర్డులు, ఉచిత వైఫై వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. NSS యూనిట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, ఫీల్డ్ ట్రిప్స్, యోగా, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. క్రీడా మైదానం, ఇండోర్ గేమ్స్, జిమ్, బాలికలకు ప్రత్యేక వసతులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వ స్కాలర్షిప్, ప్లేస్‌మెంట్ అవకాశాలు, పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. 2007-08 నుంచి కాకతీయ యూనివర్సిటీ ఫలితాల్లో ఈ కళాశాల గ్రామీణ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు. గ్రామీణ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జీవవేణి, జ్యోతి, ఫాతిమా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!