ములుగు జిల్లాలో మంత్రి దనసరి సీతక్క పర్యటన

Written by telangana jyothi

Published on:

ములుగు జిల్లాలో మంత్రి దనసరి సీతక్క పర్యటన

తెలంగాణ జ్యోతి,ఏటూరునాగారం ప్రతినిధి,25 డిసెంబర్ : మంత్రి నైనా పేదల పక్షాన నిలబడతానని పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి  సీతక్క అన్నారు. 2024 ఫిబ్రవరిలో  జరిగే  శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ఏర్పాట్లను మేడారంలో పరిశీ లించారు.ముందుగా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లిం చుకున్నారు. అనంతరం  పోలీసు  అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలిసి జాతర అభివృద్ధి పనులను,ఏర్పాట్లను పర్య వేక్షించి పరిశీలించారు. ఏటూరునాగారంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొ ని వారికి శుభాకాంక్షలు తెలిపి దుప్పట్లు పంపిణీ చేశారు. తదనంత రం గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన మంతె న శంకర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్య లు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడు తూ తెలంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలని,ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడుతానని, మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ములుగు జిల్లా అటవీ సంపద, వనరులతో కూడి ఉందని, గత ప్రభుత్వం వనరుల ను ఇక్కడ నుండి తరలించకపోవడమే గాని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు.ఏటూరునా గారం గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో వరదలు వస్తున్నా యని,కరకట్టకు చర్యలు తీసుకుంటామని, సీసీ రోడ్లు వేస్తామని అన్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇందిరమ్మ అభయ హస్తం కింద ప్రకటించిన 6 గ్యారంటీలను ఈనెల 28 నుండి ప్రతి గ్రామపంచా యతీలో అప్లికేషన్లు స్వీకరించి అర్హులందరికీ త్వరలోనే 6 గ్యారెంటీ లను అమలు పరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం ప్రజల ఆదా యం పెంచే దిశగా చర్యలు తీసుకోలేదని,కేవలం వారి ఆదాయం మాత్రమే పెంచుకున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద వారికి ఇల్లు కట్టించడం,ఉపాధి కల్పించడం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ 130 సంవత్సరాల ఆవిర్భావం సందర్భంగా ఈనెల 28 నుండి ప్రతి గ్రామపంచాయతీలో ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తామని, పేదవారు 6 గ్యారెంటీలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిటమట రఘు, అప్సర్, ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,నాయకులు ఖలీల్, ఆయుబ్, కార్యకర్తలు రంజిత్, శ్రీనివాస్, కిషోర్, అనుబంధ సంఘాల నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “ములుగు జిల్లాలో మంత్రి దనసరి సీతక్క పర్యటన”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now