వెంకటాపురంలో ‘ఎరైవ్ ఎలైవ్’ అవగాహన కార్యక్రమం
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 17, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం పట్టణంలోని శివాలయం సెంటర్లో శుక్రవారం ‘ఎరైవ్ ఎలైవ్’ కార్యక్రమాన్ని పోలీసుశాఖ, 108అంబులెన్స్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తం గా నిర్వహించాయి. ఈ సందర్భంగా వాహనదారులు, డ్రైవర్లకు గోల్డెన్ అవర్ కాన్సెప్ట్‌పై అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన ఎంత ముఖ్యమో వివరించారు. ప్రమాదం జరిగిన తొలి గంటలో సరైన వైద్య సహాయం అందితే ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్సై సాయి కృష్ణ, మెడికల్ ఆఫీసర్ డా. శివాజీ, 108 టెక్నీషియన్ ప్రవీణ్, పైలెట్ కుప్పిలి రాధాస్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









