పేరూరు పీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకాలు

On: April 4, 2026 9:02 PM

పేరూరు పీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకాలు

పేరూరు పీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకాలు

బాలికల ఆరోగ్య రక్షణకు ముందడుగు

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 4, తెలంగాణ జ్యోతి: ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గ్రామ పంచాయతీల సర్పంచుల సమక్షంలో డాక్టర్ తరుణ్ ఆధ్వర్యంలో 11 మందికి హెచ్‌పీవీ టీకాలు అందించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగకరమని, ముందస్తు జాగ్రత్తగా బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మహిళలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హెచ్‌పీవీ టీకా కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు సర్పంచ్ గోడ్డే సరోజిని, కృష్ణాపురం సర్పంచ్ పూణెం విజయబాబు, టేకులగూడెం సర్పంచ్ చిడెం బాలకృష్ణ, చండ్రుపట్ల సర్పంచ్ అనుముల సంధ్యారాణి, వార్డు సభ్యుడు శరత్, ఆరోగ్య విస్తరణ అధికారి వేణుగోపాలకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ రమాదేవి, ఎఎన్ఎంలు శకుంతల, శ్రీదేవి, సుమలత, శారదా రాజ్యలక్ష్మి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!