మిల్స్ కాలనీ ఎస్సై సస్పెండ్
వరంగల్, మార్చి 26, తెలంగాణ జ్యోతి : వరంగల్ జిల్లాలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువుకావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మరో ఎస్సై కూడా సివిల్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ తన వ్యక్తిగత నంబర్ నుంచి ఫోన్‌లు చేసి ఇబ్బందులు కలిగిస్తున్నట్లు సమాచారం.








