ఆదివాసి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్

On: March 25, 2026 3:40 PM

ఆదివాసి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్

ఆదివాసి కుటుంబానికి అండగా అమ్మ ఫౌండేషన్

వెంకటాపురం నూగూరు, మార్చి 25, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి దుబ్బ అశోక్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. నాలుగేళ్ల చిన్నారి, భార్య, తల్లి అనాధలుగా మారి పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితిని గ్రామ యువత అమ్మ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లగా, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ పీర్ల కృష్ణ బాబు వెంటనే స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సభ్యులు బట్టి విజయ్ కుమార్, దుర్గారావు ఆధ్వర్యంలో గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా రూ.4 వేల విలువైన నిత్యావసర సరుకులు మరియు రూ.3 వేల నగదును అందజేసి, భవిష్యత్తులో మరింత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉయిక వంశీ, సాయిబాబు, వేణు, రాకేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సహాయానికి గ్రామస్తులు అమ్మ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!