అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్ రెడ్డి
ములుగు, మార్చి 23, తెలంగాణ జ్యోతి : అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు సోమవారం ముందస్తు అరెస్ట్లు చేశారు. భాస్కర్ రెడ్డితోపాటు బీజేపీ మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు, పట్టణ అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్, గాదం కుమార్, ప్రమోద్ రెడ్డి, మహేందర్ తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాటాలు చేసేందుకు పోతున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రజస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని, పాలకులు జవాబుదారీతనంగా వ్యహరించాలే తప్ప అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.








