వెంకటాపురంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసుల చర్యలు
వెంకటాపురం నూగూరు, మార్చి 23, తెలంగాణ జ్యోతి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనగా చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బీజేపీ నాయకుల ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పిలుపు మేరకు హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన మండల అధ్యక్షుడు రామేళ్ల రాజశేఖర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా నిరోధించేందుకు ముందస్తు చర్యగా ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేపడుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.









