కాసిందేవిపేటలో ఘనంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు
ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ లో పాల్గొన్న సర్పంచ్
ములుగు, మార్చి 21, తెలంగాణ జ్యోతి: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాసిందేవిపేట గ్రామ సర్పంచ్ వాంకుడోత్ నిరోషా అమర్ సింగ్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్‌లో పాల్గొని వారికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, ప్రేమ, త్యాగ భావాలను తెలియజేస్తుందని అన్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలు క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా పేదలకు చేసే దానధర్మాలు సామాజిక సమానత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.





