ఉట్ల తోగులో నిరుపేదలకు బట్టల పంపిణీ
వెంకటాపూర్, మార్చి 20, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూరుగుపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్ల తోగు గొత్తికోయలకు గ్రేస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ దేవరాజు ఏకాంబరం, జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకుండా జీవిస్తున్న నిరుపేదలకు సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 50 మంది పిల్లలు, పెద్దలకు రగ్గులు, దుప్పట్లు, మహిళలకు చీరలు, టవల్స్ పంపిణీ చేశారు. స్థానిక పరిస్థితులను పరిశీలించిన అనంతరం త్వరలో దోమతెరలు, సోలార్ లైట్లు కూడా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరుగుపేట గ్రామ సర్పంచ్ సేదమల్లక్క సారంగం, నాయకులు భీమ్రావు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు చిర్ర గణేష్, లెక్చరర్ చిర్ర సురేష్, రత్నం సురేందర్, కేతిరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.






