ములుగులో ఉచిత బ్యూటిషన్, టైలరింగ్ శిక్షణ ప్రారంభం
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు
ములుగు, మార్చి 20, తెలంగాణ జ్యోతి: ములుగు పట్టణంలో వేద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత బ్యూటిషన్ మరియు టైలరింగ్ శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం గా సంస్థ అధ్యక్షుడు జనార్దన్ నోముల మాట్లాడుతూ మహిళల ఆర్థికా భివృద్ధి, స్వయం ఉపాధి లక్ష్యంగా ఈ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు సర్టిఫికెట్‌తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కో ఆర్డినేటర్లు మౌనిక, నాగవేణి తదితరులు పాల్గొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, శిక్షణ కేంద్రాలు ములుగు పత్తిపల్లి రోడ్డులోని సోనీ పార్లర్ మరియు శివాలయం రోడ్డులో ఆల్ఫా బేకరీ పక్కన ఉన్న నాగవేణి టైలరింగ్ షాప్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 6281771545 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.






