గాంధీనగర్‌లో సోలార్ లైట్లు ఏర్పాటు

On: March 20, 2026 5:48 PM

గాంధీనగర్‌లో సోలార్ లైట్లు ఏర్పాటు

గాంధీనగర్‌లో సోలార్ లైట్లు ఏర్పాటు

యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్‌కు కృతజ్ఞతలు

ములుగు, మార్చి20,తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామపంచాయతీలో యునైటెడ్ వే ఆఫ్ హైదరా బాద్ ఎన్జీవో సహకారంతో గ్రామ వీధుల్లో 15 ఎల్ఈడి సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నిర్మల వెంకన్న మాట్లాడుతూ, సోలార్ ప్యానల్ ఆధారిత వీధి దీపాల ఏర్పాటు వల్ల కరెంట్‌పై ఆధారపడకుండా గ్రామ వీధులు వెలుగులతో కళకళలాడు తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ కందూరి రాములు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ములుగు కోఆర్డినేటర్ ల్యాగల రాజు, ఉప సర్పంచ్ వల్లపు మహేష్, కార్యదర్శి భారతి, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!