ములుగు జిల్లా టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా లాదేళ్ల అశోక్
ములుగు, మార్చి 18, తెలంగాణ జ్యోతి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (TS MRPS) ములుగు జిల్లా అధ్యక్షుడిగా లాదేళ్ల అశోక్‌ను నియమిస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ మాదిగ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి లాదేళ్ల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ తనపై ఉంచిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ దళిత నాయకులకు అండగా నిలుస్తూ తన సేవలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ ములుగు వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్రి దినాకర్, నాయకులు జనార్ధన్, పులి ఆలిస్, మామిడి నరసింహ రాములు, చిన్న అశోక్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.






