నాల్గవ వార్డులో రంజాన్ తోఫా పంపిణీ
ములుగు, మార్చి 18 తెలంగాణ జ్యోతి: జిల్లా కేంద్రంలోని నాల్గవ వార్డులో ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రంజాన్ తోఫా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మరియు ములుగు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుంటోజు పావని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు అమలవుతుండగా, ఈ సందర్భంగా గుంటోజు పావని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమంగా గౌరవిస్తూ సెక్యులరిజంను కాపాడే పార్టీ అని తెలిపారు. ముస్లిం సోదర, సోదరీమణుల పండుగను గౌరవిస్తూ రంజాన్ తోఫా ద్వారా బట్టలు పంపిణీ చేయడం ప్రభుత్వ మానవతా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను ఉపయోగించుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసే పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షర్ఫుద్దీన్, రబ్బానీ, మహమ్మద్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు.





