పేకాట స్థావరంపై పోలీసుల దాడి : 4 గురి అరెస్ట్
ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని 5వ వార్డు పరిధిలోని ఓపెన్ ప్లాట్స్‌లో పేకాట ఆడుతున్న వారిపై ములుగు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై యు. ఉపేందర్ రావు, 2వ ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో నలుగురిని పట్టుకోగా ఒకరు పరారయ్యారు. పట్టుబడిన నలుగురు వద్ద నుంచి రూ.2,700 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట వంటి వ్యసనాలు యువతను అప్పులపాలు చేసి ఆత్మహత్యలు, కుటుంబ కలహాలకు దారితీస్తాయని ఎస్సై ఉపేందర్ రావు అన్నారు. పేకాట, గంజాయి వంటి నిషేధిత కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించే వారికి పారితోషికం అందజేస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వెల్లడించారు.






