Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

వలస ఆదివాసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

On: March 17, 2026 6:16 PM

వలస ఆదివాసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

వలస ఆదివాసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్

– ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా

ములుగు, మార్చి 17, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని 73వలస ఆదివాసీ గూడాలలో వారం రోజుల నుంచి అధికారులు ఇష్టానుసారంగా సాగుభూములలో కందకాలు తవ్వుతున్నారని, ప్రభుత్వం వలస ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ములుగులో ఆదివాసీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. గత 20ఏళ్లుగా పోడు చేసుకొని సాగుచేసుకుంటున్న ఆదివాసీల భూముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు కందకాలు తవ్వడం ఏంటని విమర్శించారు. పోడు సాగు చేసుకొని భూములు దున్నుకుంటుంటే హక్కుపత్రాలు ఇవ్వకుండా దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. అటవీ హక్కును చట్టం 2006 ప్రకారం సర్వే నిర్వహించారని, కేవలం ఎస్టీ సర్టిఫికెట్లు లేనందున హక్కుపత్రాలు రాలేదన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారని, వెంటనే అమలు చేయాలని కోరారు. పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగుదారులను సమీకరించి ఛలో అసెంబ్లీ చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ములుగు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి, ఎండి.దావూద్, రత్నం రాజేందర్, కొప్పుల రఘుపతి, జిల్లా కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి, ఎండీ.గఫూర్ పాషా, దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, దామోదర్, రత్నం ప్రవీణ్, కురుసం చిరంజీవి, కుర్ర రాజు, మడకం రాజు, మడకం సోమయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!