సమయపాలన లేని వైద్య సిబ్బంది.. రోగుల ఇబ్బందులు..!
కన్నాయిగూడెం, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది నిర్దిష్ట సమయానికి హాజరు కాకపోవడంతో ఉదయం నుంచే వచ్చిన రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో డాక్టర్ తన క్వార్టర్స్‌లో ఉండటం, ల్యాబ్ టెక్నీషన్ అందుబాటులో లేకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషన్ ఉదయం హాజరై సాయంత్రం నాలుగు గంటలకంటే ముందే వెళ్లిపోతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమయపాలనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.







