Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బడే నాగజ్యోతి సాయం

On: March 17, 2026 2:11 PM

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బడే నాగజ్యోతి సాయం

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బడే నాగజ్యోతి సాయం

వెంకటాపురం నూగూరు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం మోరుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని బొల్లారం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆదివాసి పేద మహిళకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాన్ని ములుగు నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇంచార్జి, మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి మంగళవారం పరామర్శించి మనోధైర్యం కల్పించారు. బాధితురాలు బాడిశ రాధకు నిత్యావసర సరుకులతో పాటు 25 కిలోల బియ్యం, రూ.3 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం వెంటనే ఐటిడిఎ ద్వారా టిఆర్ఎఫ్ ఫండ్ విడుదల చేసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోరుమూరు గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ పూసం నరేష్ కుమార్, జిల్లా నాయకులు మంచర్ల నాగేశ్వరరావు, బట్ట నాగేంద్ర, మాజీ వార్డు సభ్యులు బోదేబోయిన మోహన్ రావు, కాంతి విజయ్, నాయకులు శ్యామల వీరయ్య, చందా లక్ష్మయ్య, యువకులు బట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!