Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన మునీందర్

On: March 17, 2026 1:14 PM

ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన మునీందర్

ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన మునీందర్

డిప్యూటేషన్‌పై నియామకం.. సిబ్బంది సత్కారం

ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా దాసరి మునీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనను రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కమిషనర్ హైదరాబాద్ ఉత్తర్వుల మేరకు డిప్యూటేషన్‌పై నియమించారు. సబ్ రిజిస్ట్రార్ దిలీప్ చంద్ర గోపాల్ కరీంనగర్ డిఐజి కార్యాలయానికి బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది మునీందర్‌ను శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి రిజిస్ట్రేషన్ సేవలను సమయానికి అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. వినియోగదారులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది స్రవంతి, రాజేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!