రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
అయ్యవారిపేటలో ఉపాధి హామీ నిధులతో పనుల ప్రారంభం
వెంకటాపురం నూగూరు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మడకం బెనిని కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ సీసీ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, ఉప సర్పంచ్ కాలేశ్వరపు సర్వేశ్వరరావు, సద్దన్నపు నరసింహ చారి, తెల్లం బుల్లేశ్వరరావు, గోగు నరసింహారావు, తుండే రాజబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






