Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

హెచ్‌టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం

On: March 16, 2026 6:44 PM

హెచ్‌టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం

హెచ్‌టి విద్యుత్ సర్వీసులకు సింగిల్ విండో విధానం

ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): హెచ్‌టీఈ 11 కేవీ, 33 కేవీ మరియు అంతకంటే పై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థ అమల్లో ఉందని ములుగు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏ. ఆనందం తెలిపారు. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 6 హెచ్‌టీఈ సర్వీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. వినియోగదారులు TGNPDCL పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే UID నంబర్ ఉత్పత్తి అవుతుందని, ఆ ద్వారా దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. 11 కేవీ దరఖాస్తుల ఫీజిబిలిటీని రెండు రోజుల్లో పరిశీలించి సమాచారం SMS రూపంలో పంపిస్తారని, 33 కేవీ మరియు అంతకంటే పై వోల్టేజ్ దరఖాస్తులను సంబంధిత ఉన్నతాధికారులు పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలతో మంజూరు చేస్తారని తెలిపారు. సింగిల్ విండో విధానం వల్ల వినియోగదారులు కార్యాలయాలకు తిరుగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!