వార్త రాసినందుకే బెదిరింపులా..?

On: February 9, 2026 10:41 AM

ఎంపీడీఓకి ఎందుకు పట్టింపులేదు..?

వార్త రాసినందుకే బెదిరింపులా..?

విలేకరిపై కాంట్రాక్టర్ దురుసు వైఖరి

కన్నాయిగూడెం, ఫిబ్రవరి9, తెలంగాణజ్యోతి:  మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ప్రజాధనంతో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్ భవనంలో నాణ్యత లోపాలపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ఓ విలేకరి వార్త రాయడంతో కాంట్రాక్టర్ దురుసుగా వ్యవహరించిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా వాస్తవాలను ప్రజల ముందుంచిన విలేకరిని “ఎందుకు వార్త రాసినావు..? ఎక్కడ నాణ్యత లేదో చూపించు” అంటూ ర్యాష్‌గా మాట్లాడటం, బెదిరించే ధోరణి ప్రదర్శించడం మీడియా స్వేచ్ఛపై దాడిగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజాధనం ఖర్చవుతున్న పనులపై ప్రశ్నించడం విలేకరి హక్కు మాత్రమే కాక బాధ్యత అవుతుంది. అటువంటి విధి నిర్వర్తనను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాల్‌గా మారిందని పేర్కొంటూ, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, విలేకరిని బెదిరించిన కాంట్రాక్టర్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, పాత్రికేయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!