వెంకటాపురంలో సీఎం కప్ ఎంపిక పోటీలు
వెంకటాపురం నూగూరు, ఫిబ్రవరి 6 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సీఎం కప్–2026 కోసం గ్రామస్థాయిలో ఎంపికైన విద్యార్థులు, విద్యార్థినీలకు మండల స్థాయి ఎంపిక క్రీడా పోటీలు శనివారం (7వ తేదీ) నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, చెస్, క్యారమ్స్, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రతిభను ప్రదర్శించేలా ఎంపిక పోటీలు వెంకటాపురం మండల కేంద్రంలోని కాపీడ్ గ్రౌండ్లో 7-2-2026 న జరగనున్నాయని వెల్లడించారు. గ్రామ పంచాయతీల నుంచి ఎంపికైన విద్యార్థులు ఉదయం 10.30 గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. సీఎం కప్ పోటీల ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, శారీరక దృఢత్వం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు ఎంపీడీవో జి. జుమ్మిలాల్, ఎంఈఓ జి.వి.వి. సత్యనారాయణలు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.







