తెలంగాణ జ్యోతి కథనానికి ఎంపీడీఓ స్పందన
సమస్యలపై త్వరలో చర్యలు :ఎంపీడీఓ సాజిదా
కన్నాయిగూడెం, ఫిబ్రవరి 6 (తెలంగాణ జ్యోతి): ఎంపీడీఓ కార్యాలయ పరిసరాల్లో నెలకొన్న సమస్యలపై తెలంగాణ జ్యోతి లో ప్రచురితమైన కథనానికి ఎంపీడీఓ సాజిదా స్పందించారు. ప్రస్తుతం తాను మేడారం జాతర విధుల్లో ఉన్న కారణంగా కార్యాలయ పనులపై ప్రత్యక్షంగా దృష్టి పెట్టలేకపోయినట్లు తెలిపారు. జాతర విధులు ముగిసిన వెంటనే శనివారం కార్యాలయానికి చేరుకొని సమస్యను స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని ఆమె తెలిపారు.






