మేడారం జాతరకు టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు

On: January 24, 2026 8:11 PM

మేడారం జాతరకు టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు

బస్ స్టేషన్ల వారీగా ఛార్జీల విడుదల

హైదరాబాద్, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతరకు టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) ప్రకటించింది. 2026 మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర 28-01-2026 నుండి 31-01-2026 వరకు జరగనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారం, వరంగల్, ములుగు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక సర్వీసులకు సంబంధించి మార్గాల వారీగా ఛార్జీలను కూడా ఆర్టీసీ విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి మేడారం చేరుకునేలా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్న అధికారులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సురక్షితంగా, సౌకర్యవంతంగా జాతరకు చేరుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!