మేడారం జాతరకు వెళ్లాలంటే ఆర్టీసీ ప్రయాణమే బెస్ట్

On: January 24, 2026 2:42 PM

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ములుగు జిల్లా ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం మేడారానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఆర్టీసీ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించేందుకు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. బస్టాండ్ ప్రారంభం అనంతరం అధికారులు జాతర సందర్భంగా చేపట్టిన రవాణా ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. భక్తులకు సులభంగా రాకపోకలు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బస్సుల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు.

మేడారం జాతరకు వెళ్లాలంటే ఆర్టీసీ ప్రయాణమే బెస్ట్

మహా జాతరకు 4 వేల బస్సులు – మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణం

భక్తుల రద్దీకి తగిన రవాణా ప్రణాళిక – తాత్కాలిక ఖర్చులకు చెక్ – కోట్ల ఆదా లక్ష్యం

మేడారం జాతరకు 51 కేంద్రాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

రవాణా–పోలీస్–జిల్లా పాలన కలసి ప్రత్యేక పర్యవేక్షణ

మంత్రి సీతక్క సారథ్యంలోపగడ్బందీగా జాతర ఏర్పాట్లు

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026ను పురస్కరించుకుని భక్తులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ కాంప్లెక్సులు, బస్టాండ్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఉదయం మేడారం చేరుకున్న మంత్రి సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి సుమారు 4 వేల ఆర్టీసీ బస్సులను మేడారం జాతర కోసం ప్రణాళికాబద్ధంగా నడుపుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు కూడా సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించిందని గుర్తు చేసిన మంత్రి, జాతర సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. భక్తులు సొంత వాహనాలకంటే ప్రభుత్వ బస్సుల ద్వారానే మేడారానికి రావాలని కోరారు. సొంత వాహనాలతో వస్తే దూరంగా పార్కింగ్ చేయాల్సి రావడంతో పాటు నడకలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. జాతర సందర్భంగా 91 బస్ కేంద్రాల్లో క్యూ లైన్లు, షెల్టర్లు, తాగునీరు, వాష్‌రూములు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సులు మధ్యలో నిలిచిపోతే వెంటనే పరిష్కరించేందుకు క్రేన్లు, మొబైల్ టీమ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్ కాకుండా రవాణా శాఖ, పోలీస్ శాఖ, జిల్లా పాలన సమన్వయంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈసారి ప్రత్యేకంగా చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 11 ప్రధాన బస్ స్టాండ్లలో పిల్లల పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసి ట్రాకింగ్ ట్యాగ్ కట్టడం ద్వారా తప్పిపోయిన పిల్లలను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను కేవలం నాలుగు రోజుల పండుగగా కాకుండా ఏడాది పొడవునా భక్తులు వచ్చేలా, ప్రాంత అభివృద్ధికి కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. అటవీ ప్రాంతమైన మేడారంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, ప్రతి ఏడాది తాత్కాలిక ఏర్పాట్లకు ఖర్చవుతున్న 3 నుంచి 4 కోట్ల రూపాయలను ఆదా చేసి శాశ్వత మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మేడారంలో శాశ్వత బస్టాండ్, శాశ్వత క్యూ లైన్ల నిర్మాణంతో పాటు ములుగు బస్టాండ్, ఏటూరునాగారం బస్ డిపో, మంగపేట ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి సీతక్క సారథ్యంలో జాతర ఏర్పాట్లు పకడ్బందీగా కొనసాగుతున్నాయని పేర్కొన్న మంత్రి, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే మహా జాతరలో భక్తులను సురక్షితంగా తీసుకువెళ్లి తిరిగి వారి స్వస్థలాలకు చేర్చడమే రవాణా శాఖ ప్రధాన బాధ్యతగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, పార్లమెంట్ సభ్యులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు
ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి):
సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ములుగు జిల్లా ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం మేడారానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఆర్టీసీ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం మంత్రులు శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.
మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం
ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి):
సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించేందుకు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.
బస్టాండ్ ప్రారంభం అనంతరం అధికారులు జాతర సందర్భంగా చేపట్టిన రవాణా ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. భక్తులకు సులభంగా రాకపోకలు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బస్సుల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు. సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు
ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి):
సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ములుగు జిల్లా ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం మేడారానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఆర్టీసీ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం మంత్రులు శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.
మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం
ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి):
సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించేందుకు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.
బస్టాండ్ ప్రారంభం అనంతరం అధికారులు జాతర సందర్భంగా చేపట్టిన రవాణా ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. భక్తులకు సులభంగా రాకపోకలు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బస్సుల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు.

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు

సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ములుగు జిల్లా ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం మేడారానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఆర్టీసీ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించేందుకు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. బస్టాండ్ ప్రారంభం అనంతరం అధికారులు జాతర సందర్భంగా చేపట్టిన రవాణా ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. భక్తులకు సులభంగా రాకపోకలు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బస్సుల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు.

సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న మంత్రులు
ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి):
సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం ములుగు జిల్లా ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం మేడారానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఆర్టీసీ అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం మంత్రులు శ్రీ సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.
మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం
ములుగు, జనవరి 24 (తెలంగాణ జ్యోతి):
సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించేందుకు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.
బస్టాండ్ ప్రారంభం అనంతరం అధికారులు జాతర సందర్భంగా చేపట్టిన రవాణా ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. భక్తులకు సులభంగా రాకపోకలు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బస్సుల నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!