ఉపాధి హామీ పథకం చట్టం పేరును మార్చడం బిజెపికి సిగ్గుచేటు
కాంగ్రెస్ నాయకుల తీవ్ర విమర్శ
కాటారం, జనవరి 24, (తెలంగాణ జ్యోతి) : ఉపాధి హామీ పథకం చట్టం పేరును మార్చి గ్రామీణ నిరుపేదలకు ఉపయోగపడే పనులను మార్చడం పట్ల కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆక్షేపించారు. శనివారం మండలంలోని ఇబ్రహీంపల్లి, అంకుశాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో గ్రామ సభలు నిర్వహించారు. 2006లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు రక్షణ కల్పించే దిశగా ఉపాధి చట్ట రూపకల్పన చేస్తే బిజెపి ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పేదవానికి పేదలకు రక్షణ కల్పించే దిశగా ఉపాధి చట్ట రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని చట్ట రూపం దాల్చి హక్కుగా పెట్టడంతో ఇది గిట్టని కార్పొరేట్ సంస్థలకు భర్త పలుకుతున్న మోడీ బీజేపీ ప్రభుత్వం గ్రామీణ నిరుపేదల పొట్ట కొడుతుందని ఆరోపించారు. చట్టంలోని డిమాండ్ ను తొలగించి సప్లై అంశాన్ని తీసుకువచ్చి కూలీల పనితనాన్ని తగ్గించి మళ్లీ యంత్రాలను ఉపయోగించుకునేలా చట్ట రూపకల్పన చేసినారని ఆరోపించారు. ఇది ఉపాధి హామీ చట్ట నిబంధనలకు పూర్తి విరుద్ధమని అలాగే కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామపంచాయతీ అధికారాలను హక్కును కాలరాసింది. పేదవాడిని పొట్ట కొట్టే దిశగా గతంలో 90 రోజుల పని దినాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించగా నేడు 125 రోజుల పేరుతో రాష్ట్రాలపై భారం నెట్టి కేవలం 70 రోజులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మిగతా 55 రోజులను రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలని నిబంధన విధించింది. ఇది పూర్తిగా ఎంజిఎన్ఆర్ఇజిఎస్ చట్టానికి విరుద్ధం. అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనులను నిర్ణయించుకునే అధికారం కూలీలకు గ్రామస్తులకు ఉండేది కానీ నేడు ఈ చట్ట మార్పు వల్ల ఆ అధికారాన్ని కోల్పోయి సంవత్సరానికి 60 రోజులను క్రాప్ హాలిడే పేరిట గ్రామీణులను వారి జీవితాలను సకల వికలాం చేస్తుంది. ఇంత తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న మోడీ చర్యలను తీవ్రంగా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి సర్పంచులు దబ్బేట సరోజన రాజేష్. సుధీర్ కల్పన దేవయ్య ఉపసర్పంచ్ కర్క ఉమాశంకర్. చీర్ల తిరుపతిరెడ్డి చాంద్ పాషా ఆత్మకూరి కుమార్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






