ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా మేడారంకు వెళ్లాలి
కాటారం డిఎస్పి సూర్యనారాయణ
కాటారం, జనవరి 23,(తెలంగాణ జ్యోతి) : మేడారం మహా జాతరకు వివిధ రకాలుగా వెళ్లే భక్తులు రోడ్డు భద్రత నిబంధనలు పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా మేడారం జాతరకు సురక్షితంగా ప్రయాణం చేయాలని కాటారం పోలీస్ సబ్ డివిజనల్ అధికారి సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం కాటారంలో విలేకరులతో మాట్లాడుతూ. కాటారం సబ్ డివిజన్ పరిధిలో 600 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసినట్లు కాటారం డిఎస్పి సూర్యనారాయణ తెలిపారు. మేడారం వెళ్లే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని, మేడారం జాతరకు వెళ్లి వస్తున్న యాత్రికులను, వెళ్లే భక్తులు సూచనలు సలహాలు స్వీకరించాలని, ముఖ్యమైన సలహాలు జాగ్రత్తలు పోలీసులకు సమాచారం ఇచ్చిన అమలు చేస్తామని డిఎస్పీ తెలిపారు. డిఎస్పి సూర్యనారాయణ అన్నారు. కాలేశ్వరం టు భూపాలపల్లి జాతీయ రహదారి, కాటారం నుండి మంథని రహదారి వైపు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. మన జాతరకు వెళ్లే భక్తులు తమ వాహనాలను సరైన స్థలాలలోనే పార్కింగ్ చేయాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని డిఎస్పి సూచించారు. కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు, మహా ముత్తారం ఎస్సై మహేందర్ కుమార్ పాల్గొన్నారు.






