పల్లె రాజేశ్వర్ రెడ్డిపై దాడి హేయమైన చర్య
మాజీ ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ యాదవ్
ములుగు, జనవరి23 (తెలంగాణ జ్యోతి): జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటం అత్యంత హేయమైన, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్య అని ములుగు టీఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. జనగామ పట్టణంలో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై మద్యం మత్తులో ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిపై ఈ విధమైన దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడితో సమానమని విమర్శించారు. రాజకీయ భేదాలు ఉన్నా ప్రజా సేవలో ఉన్న నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడటం ఏ మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.






