పలు దుకాణాలపై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు
ములుగు, జనవరి23,తెలంగాణ జ్యోతి :ములుగు జిల్లా కేంద్రం సమీపం లోని మేడివాగు చేపల దుకాణాలు, పస్రాలోని చికెన్, మాంసం దుకాణాలు, జవహర్ నగర్, పస్రా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులపై ములుగు, భూపాలపల్లి లీగల్ మెట్రాలజీ అధికారి ఇ. శ్రీలత ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనల ప్రకారం తూనికలు, కొలతలు సరిగా లేని కాంటాలు, తూకం పౌన్ బాట్లను అధికారులు సీజ్ చేసి, ఐదు కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. మేడారం జాతర సందర్భంగా భక్తులకు సరైన తూకంతోనే అమ్మకాలు జరపాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు పాటించని, తూనికలు–కొలతల పరికరాలను రెన్యువల్ చేయించని దుకాణాలను తనిఖీ చేసి వెంటనే రెన్యువల్ చేయించారు. ఈ కార్యక్రమంలో తూనికలు–కొలతల టెక్నికల్ అసిస్టెంట్ హఫీజ్, సిబ్బంది పాషా, శివకుమార్, సలీం, వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






