ఎదురు ఎదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ – ఒకరు మృతి
వెంకటాపురం (నూగూరు), జనవరి 21 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్ర శివారులోని మరికాల రోడ్డు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. వెంకటాపురం నుంచి సరుకులు కొనుగోలు చేసి తిరిగి గ్రామానికి వెళ్తుండగా, ఆయన వెనక కూర్చున్న కందాల చందు నడుపుతున్న బైక్‌ను ఎదురుగా వేగంగా వస్తున్న మరో మోటార్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో ములుగు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. వేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి కారణమైన కరటం కమల్‌రామ్‌పై కేసు నమోదు చేసినట్లు వెంకటాపురం ఎస్సై కే. తిరుపతిరావు తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రైతు కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు(52) మృతితో మరికాల గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






