మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ప్రత్యేక వ్యూహం

On: January 20, 2026 11:41 PM

మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ప్రత్యేక వ్యూహం

మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ ప్రత్యేక వ్యూహం

హైదరాబాద్, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం ఇన్‌ఛార్జ్‌లు, సహ ఇన్‌ఛార్జ్‌లను అధికారికంగా నియమించింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మహారాష్ట్ర మంత్రి అశిష్ సెలార్ ను నియమించగా, సహ ఇన్‌ఛార్జ్‌లుగా రాజస్థాన్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, ఎంపీ రేఖ శర్మలకు బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకాలతో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!