కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు

On: January 20, 2026 6:11 PM

కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు

కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు

మావోయిస్టుల కదలికలకు చెక్ పెట్టే లక్ష్యంతో భద్రతా బలోపేతం

వెంకటాపురం, జనవరి20 (తెలంగాణజ్యోతి):ములుగుజిల్లా వెంకటాపు రం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం మురుమూరు పంచాయతీ పరిధి తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రె గుట్టలపై మంగళవారం కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయగా సిఆర్పిఎఫ్  దక్షిణ విభాగం ఐజి టి విక్రమ్ ప్రారంభిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మురుమూరు నుంచి పామునూరు గుట్టల వరకు రహదారి నిర్మాణం చేపట్టి, 20 కుటుంబాలకు పైగా నివసిస్తున్న పామునూరు గ్రామ సమీపంలో క్యాంప్‌ను నెలకొల్పారు. మావోయిస్టులు రక్షిత ప్రాంతంగా భావిస్తూ తలదాచుకునే కర్రెగుట్టలలో వారి కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ఈ క్యాంప్ ఉపయో గపడుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పామునూరు గిరిజనులకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయ గా క్యాంప్ ప్రారంభం నేపథ్యంలో ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎస్హెచ్.అనిల్ మింజ్, 39బెలాటియన్ కమాండెంట్ ప్రశాంత్ శ్రీ వాత్సవ, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, ఏఎస్పీ మనన్ భట్, 89బెటాలియన్ కమాండెంట్ ముఖేష్,  తదితరులు పాల్గొన్నారు.

కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!