గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

On: January 20, 2026 2:30 PM

గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ములుగు, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): గట్టమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో, పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి అమ్మ వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!