వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల సందడి
మేడారం జాతర సందర్భంగా పోటెత్తిన భక్తజన సందోహం
వేములవాడ, జనవరి 20 (తెలంగాణ జ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రసిద్ధ బద్దిపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతోంది. ప్రపంచ ప్రసిద్ధ మేడారం జాతర సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా వేములవాడకు తరలివచ్చారు. ఉదయం నుంచే మహిళలు సంప్రదాయ వేషధారణలో బోనాలు మోసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, డప్పుల మోగింపు–మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిస రాలు మార్మోగాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ కమిటీతో పాటు పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టి క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.






