మున్సిపాలిటీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలి
– మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ టి. రాజేశ్వర్ రావు
ములుగు,జనవరి19(తెలంగాణజ్యోతి):నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగుర వేయాలని మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ టి. రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. సోమవారం ములుగు రాయల్ ప్లాజాలో జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం అధ్యక్షతన నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల సమాయత్త సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన పాలనకు ఆకర్షితులై మున్సిపాలిటీ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చే సత్తా ఒక్క బీజేపీకే ఉందని పేర్కొన్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క–సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకురావడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రతి నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటా ప్రచారం చేస్తూ పకడ్బందీ ప్రణాళికతో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసి బీజేపీ వార్డు కౌన్సిలర్లను గెలిపించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా అభివృద్ధి చేయలేదని, ఆ పార్టీ పని అయిపోయిందని విమర్శించారు. ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా కేంద్రం ద్వారా అధిక నిధులు తెచ్చే సామర్థ్యం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సహ ఇంచార్జీ సతీష్ షా రత్నం, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, భూక్యా రాజు నాయక్, గుగులోతు స్వరూప, మునిసిపల్ ఎన్నికల కన్వీనర్ నగరపు రమేశ్, సీనియర్ నాయకులు కారు పోతుల యాదగిరి, దేవేందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీలమంతుల రవింద్రాచారి, జాడి వెంకట్, జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, ఏనుగు రవిందర్ రెడ్డి, భర్తాపురం నరేష్, గంగిశెట్టి రాజ్ కుమార్, మండల నాయకులు లవణ్, లింగంపల్లి శ్రీను, కొత్త సుధాకర్ రెడ్డి, మేడి శెట్టి ఓమ్రా, మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు, రాకేష్ యాదవ్, పైడాకుల మల్లేశ్, మార్క సతీష్, చక్రి, సలేందర్, హరీష్, మహేందర్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






