మేడారం తరలివెళ్లిన ఇందిరా మహిళాశక్తి సభ్యులు
వెంకటాపురం (నూగూరు), జనవరి 18 (తెలంగాణ జ్యోతి): మేడారం లో సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభోత్సవానికి హాజరవుతున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు స్వాగతం పలికేందుకు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి ఇందిరమ్మ మహిళా శక్తి సభ్యులు వందల సంఖ్యలో మేడారానికి తరలి వెళ్లారు. పంచాయతీల వారీగా డ్వాక్రా గ్రూపులు, స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయగా, సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళలు ఒకే యూనిఫాం గా ఇందిరమ్మ చీరలు ధరించి “జై కాంగ్రెస్” నినాదాలతో బస్సుల్లో ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జెండాలు ఊపుతూ మహిళలకు ఘన స్వాగతం పలికారు.






